Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 రికవరీ రేటు. 60.8శాతానికి చేరుకున్న కోలుకున్నవారి సంఖ్య. కోలుకున్నవారు 95.48శాతం, మృతుల శాతం 4.52.
  • కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్రను వీడియో కాన్పిరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు‌ హాజరుపరిచిన పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇంటి నుంచే న్యాయమూర్తి కేసు విచారణ. కొనసాగుతున్న విచారణ. వీడియో కాన్పిరెన్స్ లో విచారణ అనంతరం న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ
  • తెలంగాణ లో రికార్డు స్థాయిలో కేసులు. రాష్ట్రంలో 20 వేలు, హైదరాబాద్ లో 16 వేలు దాటిన పాజిటివ్ కేసులు. లక్ష దాటిన కరోనా టెస్టింగ్ లు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 20,462. జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క రోజు 1658 కేసులు. Ghmc లో 16, 219కు చేరుకున్న కేసులు. 283 కి చేరుకున్న కరోనా మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 9984. డిశ్చార్జి అయిన వారు -10195.
  • జీవీకే కుంభకోణంపై ఈడీ ఆరా. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తమకివ్వాలని ఈడీ లేఖ. జీవీకే స్కాంపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న ఈడీ.

ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం.. తాలిబన్ల దాడిలో ఏడుగురు పౌరులు హతం..

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఉత్తర బాల్క్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలపై తాలిబాన్లు దాడి చేయడంతో కనీసం ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు మరణించారని స్థానిక అధికారులు
Taliban, ఆఫ్ఘనిస్తాన్ లో దారుణం.. తాలిబన్ల దాడిలో ఏడుగురు పౌరులు హతం..

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఉత్తర బాల్క్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలపై తాలిబాన్లు దాడి చేయడంతో కనీసం ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. షోల్గారా జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య దాడులు జరగ్గా ఏడుగురు పౌరులను తాలిబన్‌ ఉగ్రవాదులు అపహరించారు. అనంతరం వారిని హతమార్చారని స్థానిక పోలీస్‌ చీఫ్‌ సయ్యద్‌ ఆరిఫ్‌ ఇక్బాల్‌ చెప్పారు. అయితే ఈ దాడికి సంబంధించి తాలిబన్‌ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కాగా, గత ఫిబ్రవరి చివరలో తమతో కుదిరిన శాంతి ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని తాలిబన్‌ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

కాగా.. కోవిద్ 19 ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా అఫ్గాన్‌లో 14 మంది మరణించగా.. 423 మంది వైరస్‌ బారిన పడ్డారు. దక్షిణ కాందహార్‌ ప్రావిన్స్‌లో కూడా అదేరోజు సాయంత్రం జరిగిన మోటార్‌ షెల్‌ దాడిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ దాడిని తాలిబన్‌ ఉగ్రవాదులే చేశారని యూఎస్‌ బలగాలు ఆరోపిస్తుండగా.. అమెరికా భద్రతా బలగాల డ్రోన్‌ దాడిలోనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని తాలిబన్‌ ప్రతినిధి ఖరి యూసుఫ్‌ అహ్మది చెప్తున్నారు. అయితే, తామెలాంటి ఆయుధ ప్రయోగాం చేయలేదని అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్‌ స్పష్టం చేశారు.

Related Tags