కరోనా కాలంలో కూడా ఆగని తాలిబన్ల దుశ్చర్య..

తాలిబన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య చర్చలు జరిగినా.. మళ్లీ తాలిబన్ల తీరులో మాత్రం మార్పు లేదు. ఇప్పటికే ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు ఆఫ్ఘన్‌ సైనికులు తాలిబన్‌ ఉగ్రవాదులతో ఫైట్‌ చేస్తున్నారు. తాజాగా మరోసారి తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గురువారం సాయంత్రం.. ప్రభుత్వ సహకార దళానికి చెందిన 13 మందిని హతమార్చినట్లు ఆఫ్ఘన్ అధికారులు అనుమానిస్తున్నారు.బద్‌ఘిస్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామ శివారుల్లో ఉన్న ప్రభుత్వ సహకార దళానికి […]

కరోనా కాలంలో కూడా ఆగని తాలిబన్ల దుశ్చర్య..
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 4:17 PM

తాలిబన్ ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇటీవలే ఆఫ్ఘన్ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య చర్చలు జరిగినా.. మళ్లీ తాలిబన్ల తీరులో మాత్రం మార్పు లేదు. ఇప్పటికే ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు ఆఫ్ఘన్‌ సైనికులు తాలిబన్‌ ఉగ్రవాదులతో ఫైట్‌ చేస్తున్నారు.

తాజాగా మరోసారి తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గురువారం సాయంత్రం.. ప్రభుత్వ సహకార దళానికి చెందిన 13 మందిని హతమార్చినట్లు ఆఫ్ఘన్ అధికారులు అనుమానిస్తున్నారు.బద్‌ఘిస్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామ శివారుల్లో ఉన్న ప్రభుత్వ సహకార దళానికి చెందిన ఓ ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు దాడికి దిగారు. ఆ తర్వాత ఆ ఔట్‌పోస్ట్‌లో ఉన్న సిబ్బంది అదృశ్యమైయ్యారు. వారందర్నీ తాలిబన్లు హతమార్చి ఉంటారని.. ఔట్‌పోస్ట్‌లో ఉన్న ఓ సిబ్బంది తాలిబన్లకు సహకరించడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.దీంతోనే తాలిబన్లు పక్కా స్కెచ్‌ వేసి దాడికి దిగారని.. అదృశ్యమైన వారంతా మరణించినట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు.

కాగా.. గత కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల పాక్‌ నుంచి కూడా తాలిబన్లకు అనుకూలంగా ఉగ్రవాదులు కూడా ఎంటర్‌ కావడానికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పలువరు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులను ఆప్ఘన్ దళాలు హతమార్చాయి. ఇదే సమయంలో పలువురు తాలిబన్‌ ఉగ్రవాదుల్ని కూడా మట్టుబెట్టారు. అయితే తాలిబన్లు కూడా ఆఫ్ఘన్ సైన్యాన్ని హతమార్చుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్ సైన్యం పెద్ద ఎత్తున ప్రాణ నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది.