సెలబ్రెటీల అనుబంధానికి ప్రతీక.. రక్షా బంధన్..

Raksha Bandhan

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు పంచడం.. అన్నదమ్ములు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇక సెలబ్రెటీల విషయానికొస్తే తమ స్థాయిలో బహుమతులు పంచుతుంటారు.

ప్రతి యేటా రాఖీ పండగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ ఒక చోట చేరుతుంది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే చిరంజీవి సోదరీమణులు మాధవి, విజయలు చిరుకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఇక నిహారిక కూడా హీరో వరుణ్ తేజ్‌‌కి రాఖీ కట్టింది. రామ్ చరణ్ సొంత చెల్లెల్లు శ్రీజ, సుష్మితాలతో కలిసి నిహారిక కూడా రాఖీ పండుగ జరుపుకున్నారు. అలాగే హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్య త్రిపాఠి, పరిణితి చోప్రా, హన్సిక, పరిణీతి చోప్రా, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మల్లికా షెరావత్, ఏక్తాకపూర్‌లు తమ సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మరోవైపు నాగార్జున ఫ్యామిలీలోనూ రాఖీ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. సోదరి నాగ సుశీలతో నాగార్జున రాఖీ కట్టించుకున్నాడు. ఇక మహేష్ బాబు ఇంట్లోనూ.. మంజుల, ప్రియదర్శినులు మహేష్‌కు రాఖీ కట్టి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. మంచు ఫ్యామిలీలో విష్ణు, మనోజ్‌లు తమ సోదరి లక్ష్మీమంచుతో రాఖీ కట్టించుకున్నారు. నితిన్ కూడా తన సోదరితో రాఖీ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *