యుఎస్….నల్లజాతి పోలీసులను ‘శాసిస్తున్న’ నిరసనకారులు

అమెరికాలో విచిత్ర పరిస్థితి తలెత్తింది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళన జరుపుతున్నవారు క్రమంగా నల్ల జాతి పోలీసులను దాదాపు 'శాసించే స్థాయికి'..

యుఎస్....నల్లజాతి పోలీసులను 'శాసిస్తున్న' నిరసనకారులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 08, 2020 | 11:21 AM

అమెరికాలో విచిత్ర పరిస్థితి తలెత్తింది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళన జరుపుతున్నవారు క్రమంగా నల్ల జాతి పోలీసులను దాదాపు ‘శాసించే స్థాయికి’ చేరుకున్నారు. తమ నిరసనను ఆమోదిస్తున్నట్టు మోకాళ్లపై వంగి కూర్చోవాలని వారిని ‘ఆదేశిస్తున్నారు’. దీంతో అక్కడక్కడా ఆ పోలీసులు, అధికారులు కూడా పరోక్షంగా వారికి సంఘీభావం తెలపక తప్పడంలేదు. వాషింగ్టన్ లో నిరసనకారులకు, ఓ నల్లజాతి పోలీసు అధికారికి మధ్య జరిగిన సంభాషణను రాయిటర్స్ టీవీ రికార్డు చేసింది. మాకు సపోర్టుగా మీరు కూడా మోకాళ్లపై వంగి కూర్చోవాలని ఒక ఆందోళనకారుడు బ్లాక్ పోలీస్ ఆఫీసర్ ని కోరినప్పుడు.. తాను కూడా మీ లాగే నల్ల జాతీయుడినేనని, నా హక్కులకోసం మీరు కూడా పోరాడుతున్నారని, కానీ… సాంకేతికంగా నా విధి నిర్వహణలో అలా చేయలేనని  ఆయన చెప్పాడట. వైట్ హౌస్ వద్ద చేరిన ఆందోళనకారుల పట్ల ఇలాంటి సీక్రెట్ సర్వీసు ఏజంట్లు సానుభూతి ప్రకటించారు. నేను యూనిఫామ్ లో ఉన్నాను..  అందువల్ల కొన్ని పనులు చేయలేనని ఓ నల్లజాతి మహిళా పోలీసు అధికారి తెలిపిందట. అయితే మరో మహిళా పోలీసు కొంత ముందుకువఛ్చి.. వారు కోరినట్టు కొన్ని సెకండ్ల పాటు మోకాళ్లపై వంగి కూర్చుని వారికి మద్దతు తెలిపింది. యుఎస్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ని, మైనారిటీల పట్ల  అనుసరిస్తున్న విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..