Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

కరోనా ఎఫెక్ట్‌: లిప్‌ లాక్‌ సీన్స్‌ కట్!

Taiwanese TV serials cut kissing scenes to prevent spread of coronavirus, కరోనా ఎఫెక్ట్‌: లిప్‌ లాక్‌ సీన్స్‌ కట్!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో దాదాపు 800 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ మెల్లిమెల్లిగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాయి. అయితే ఈ ప్రభావం పలు దేశాల సినీ ఇండస్ట్రీపై కూడా పడింది. చైనాలో ఇప్పటికే సినిమా, సీరియల్‌ వంటి షూటింగ్‌ల అనుమతులను నిలిపివేసింది. అయితే కరోనా వైరస్‌ అంతగా ప్రభావం లేని తైవాన్‌ దేశం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి.ఇందులో భాగంగా అక్కడి టీవీ స్టేషన్స్‌ దర్శకనిర్మాతలకు పలు సూచనలు చేసింది. నటీనటులు కరోనాతో పాటు మరే వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు లిప్‌ లాక్‌ సీన్స్‌ లేకుండా షూటింగ్‌ జరపాలని కోరినట్లు అక్కడి స్థానిక మీడియా ప్రచురించింది. అంతేకాకుండా లిప్‌ లాక్‌ సీన్స్‌ ప్రభావం ప్రజలపై పడకుండా సీరియల్స్‌, సినిమాల్లో ముద్దు సన్నివేశాలను తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులను రద్దు చేసింది. కాగా, నటీనటులు ఏదైనా వైరస్‌ బారిన పడినా, అనారోగ్యంగా ఉన్నా ముద్దు సన్నివేశాల్లో పాల్గొనొద్దని ఇప్పటికే సింగపూర్‌ ఆరోగ్య శాఖ అక్కడి సినీ ఇండస్ట్రీకి సూచించింది. అంతేకాకుండా పలు జాగ్రత్తలు పాటించాలని కోరింది.

Related Tags