భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 17న వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరగనుందని భారతీయ విదేశాంగ శాఖ తెలిపింది.
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉదయానంద హాస్పిటల్‌ను సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు.
వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఉద్యోగులపట్ల వేధింపులు పెరుగుతున్నాయి. సంస్థలు వారి అంతర్గత విధానాలను సమీక్షల పేరుతో కొందరు వేధింపులకు పాల్పడుతున్నట్లు గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు వర్చువల్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి.