విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హీరో రామ్ పలు సంచలన ట్వీట్లు చేశాడు. '' పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి!'' అంటూ సంచలన ట్వీట్ చేశాడు.
విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
విజయవాడలోని స్వర్ణా ఫ్యాలెస్‌లోని కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.