కలకలం రేపిన రెండు కేజీల బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు చేదించారు. ముంబై నగల వ్యాపారి వద్ద పని చేసే గులాబ్ మాలి, ప్రవీణ్ కుమార్లు చోరీ చేసినట్లు తేల్చారు.
కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగిపోయింది. మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద వేగంగా వస్తున్న కారు అత్యంత దారుణంగా ఢీకొని బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని మామ, అల్లుళ్లు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం చిన్న కంజర్ల వద్ద చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బావిలో పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నూజివీడు మండలంలో చోటుచేసుకుంది. పాత బావి పూడ్చే పనిలో భాగంగా పనులు చేస్తుండగా జారిపడి ఇద్దరు కూలీలు మృతి చెందారు.
అక్రమంగా భారీగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఎనిమిది కోట్ల రూపాయల విలువైన గంజాయి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లా సుస్నర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. మంగళవారం ఢిల్లీపోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.40 కోట్ల విలువైన 10 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.