తెలుగు వార్తలు » today reports
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా రోజువారీ కేసులు 12 వేల లోపు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు రికార్డవుతున్నాయి.
తొలి విడత కరోనా వైరస్ వ్యాప్తితో అగ్రస్థానంలో కొనసాగిన మహారాష్ట్ర మరోసారి విజృంభిస్తోంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత కాస్త తగ్గినప్పటికీ.. ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతే స్థాయిలో నిత్యం మరణాలసంఖ్య కూడా పెరుగుతుంది.