అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడియూరప్ప హాజరుకానున్నారు.
అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది అధికమాసం నేపథ్యంలో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.