ఇటీవల కాలంలో, లాక్డౌన్ తర్వాత హుండీ ఆదాయం ఇంత రావడం ఇదే మొదటిసారి. సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో హుండీ ఆదాయం పెరిగింది..
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో తిరిగి సందడి మొదలైంది. శనివారం నాడు 13,486 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో స్వామి వారి హూండీ కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది...
తిరుమల వెంకన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి రోజుకు 9 వేల టికెట్లను..శ్రీవారి భక్తులు పొందేందుకు సౌలభ్యం కలిపించింది.