తెలంగాణలో కరోనా విజృంభణ ఆగడం లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. అందులో 40 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,414కు చేరింది. 24 గంటల్లో 13 మంది కోలుకోగా.. ఈ వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 34కు చేరింది.