రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి మరిచిపోకముందే.. టీడీపీ కూడా అదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 నాటికి పూర్తిగా తన ప్రాభవాన్నికోల్పోయింది. కేవలం 23 అసెంబ్లీ స్ధానాలకే పరిమితమై చావుతప్పి కన్ను లొట్టబోయిన విధంగా తయారైంది