ముచ్చింతల్ శ్రీరామనగరంలో నిర్వహించిన సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా ముగిసాయి. చివరిరోజు వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా నిర్వహించిన శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు సుసంపన్నమైంది.
ప్రతిరోజు 114 యాగశాలలో 1035 హోమకుండాల్లో 5 వేల మంది రుత్విజులు భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ మహాపూర్ణాహుతితో యజ్ఞం సుసంపన్నమైంది.
ముచ్చింతల్ శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. సమతామూర్తి క్షేత్రం శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగిపోతోంది. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది.
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాద్ సింగ్ ముచ్చింతల్‌కు వచ్చారు. సమతా క్షేత్రంలో ఆయన పలు పూజల్లో పాలుపంచుకున్నారు. అందుకు సంబంధించిన లైవ్ విజువల్స్ మీకోసమే..
హైదరాబాద్ మహానగరం శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరం.. దివ్యసాకేతంలో ఆధ్యాత్మిక పరిమళం ఉట్టిపడుతోంది. జై శ్రీమన్నారాయణ..! నినాదాలు మార్మోగాయి.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని మైమరిసిపోతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) శనివారం హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు రానున్నారు. రంగారెడ్డి ముచ్చింతల్‌లో రామానుజచార్య సహస్రాబ్ధి (Ramanujacharya Sahasrabdi) వేడుకలతో పాటు పటాన్ చెరు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొననున్నారు
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. సహస్రాబ్ది సమారోహం లో ముడవరోజు అష్టాక్షరి మహామంత్ర జపం తో నిర్విఘ్నంగా ప్రారంభం అయింది.
పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు.
ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. సహస్రాబ్ది సమారోహం లో ముడవరోజు అష్టాక్షరి మహామంత్ర జపం తో నిర్విఘ్నంగా ప్రారంభం అయింది.