అతి చిన్న ప్రదేశమైన శ్రీలంక భయానక ఉగ్రదాడి పాలబడి రక్తాశ్రువులు చిందిస్తున్న వేళ ఇది. క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్ నాడు మూడు చర్చిలు, మూడు స్టార్ హోటళ్లతో సహా ఎనిమిదిచోట్ల ఉగ్రమూకలు సృష్టించిన ఘోరకలి మూడు వందల మందికి పైగా అభాగ్యుల ప్రాణాల్ని బలిగొని, మరెన్నో వందలమందిని క్షతగాత్రుల్ని చేసేసింది. ఈ ఉగ్ర ఘటన శ్రీలంక�
శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన దాడులు వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వివిధ దేశాలకు చెందిన దాదాపు 300మంది శ్రీలంక పేలుళ్లలో మరణించారు. కాగా ఈ దాడిలో డెన్మార్క్‌కు చెందిన బిలియనీర్ ఆండర్స్ హోల్ష్ పోవిజన్ పిల్లల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. డెన్మార్క్ ఫ�
ఇదిలా ఉంటే శ్రీలంకలో జరిగిన మారణహోమంతో ఆ దేశ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ప్రధాన ప్రదేశాలలో అణువణువునా వారు సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొలంబోలోని ప్రధాన బస్ స్టేషన్లో 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. కాగా ఉగ్రదాడితో శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా శ్రీలంకలో మరో బాంబు పేల�
కొలంబో వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకకు 15మందితో కూడిన వైద్య బృందాన్ని పంపి అక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా బాంబు దాడుల్లో క్షతగాత్రులైన బాధితులకు సహాయం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పినరయ్ ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. పవిత్ర ఈస్టర్ సండే రోజున విదేశీ�
శ్రీలంకలో మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కొలంబోలోని సెయింట్ ఆంధనీస్ చర్చ్ వద్ద పేలుడు జరిగింది. స్పెషల్ టాస్క్ పోలీసులు బాంబును నిర్వీర్యం చేసే సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఇదిలా ఉంటే శ్రీలంలో ఆదివారం జరిగిన పేలుళ్లలో దాదాపు 300మంది మరణించగా.. 500మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే.
శ్రీలంక పేలుళ్లలో ఆరుగురు భారతీయులు మృతి చెందినట్టు కొలంబోలోని నేషనల్ హాస్పిటల్ వర్గాల నుంచి ఇండియన్ హైకమిన్‌కు సమాచారం అందినట్టు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు.
శ్రీలంకలో ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటక జేడీఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కంచనహళ్లి లక్ష్మీనారాయణ, గోవెనహళ్లి శివన్న, అడకిమరనహళ్లి మారెగౌడ, హనుమంతరాయప్ప, హెచ్.పుట్టరాజు సహా మరొక నేత ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లగా.. పేలుళ్ల ఘటన తర్వాత కుటుంబసభ్యులకు వారి నుంచి ఎలాంటి సమాచారం ర
శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 24మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారణకాండకు పాల్పడినవారు ఒకే ముఠాకు చెందిన వారని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. కాగా నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) ముఠా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై వారు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వి�
శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కొలంబోలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన పేలుళ్లు చాలా దారుణమైనవని కేటీఆర్ పేర్కొన్నారు. పవిత్ర పర్వదినం ఈస్టర్ సందర్భంగా దుండగులు విలువైన ప్రాణాలను బలితీసుకోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పేలుడు ఘటనల�
శాంతి కామికుడిగా భావించే ఏసుపై చిందిన రక్తం శ్రీలంకలోని మారణకాండకు అద్దం పడుతుంది. ఈ దశాబ్దంలోనే అత్యంత దారుణమైన మారణకాండతోొ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 210 మందికి పైగా మరణించగా, 500 మంది తీవ్ర గాయ�