పాకిస్తాన్ తో సదర్న్ ఆఫ్ఘనిస్తాన్ ని కలిపే కీలక ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్ దళాలు తమకు లొంగిపోయినట్టు వెల్లడించారు. పాకిస్తాన్ తో గల దురాండ్ లైన్ బోర్డర్ సమీపంలో..కాందహార్ రాష్ట్రంలోని 'స్పిన్ బోల్డాక్ జిల్లాగా దీన్ని వ్యవహరిస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ గురువారం పేలుళ్లతో దద్ధరిళ్లిపోయింది. జాబుల్ ప్రాంతంలో జరిగిన పేలుడులో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇరవై మందికిపైగా మృతి చెందారు. మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరు�