దీప్తి ఏడ్చింది! ఇన్‌స్టా లైవ్‌లోనే ఏడ్చింది. కాని ఆ ఏడుపు లోనూ చిన్నపాటి ఆర్ట్‌ను చూపించింది. విశ్వనాథ్ సినిమాలో హీరోయిన్ లా... త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్టులా..
షణ్ముఖ్, దీప్తి సునయనల ప్రేమ బంధం తెగిపోయింది. న్యూఇయర్‌కు ఒక్క రోజు ముందే.. బురువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా.. అఫీషియల్‌గా చెప్పేసింది దీప్తి. ఎంతో అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా క్లారిటీ కూడా ఇచ్చింది.
అనుకున్నట్లే జరిగింది. బిగ్ బాస్ షో రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ రియాల్టీ షో కారణంగా ఇద్దరు కంటెస్టెంట్లు పూర్తి నెగటివిటీని మూతగట్టుకున్నారు.
దీప్తి సునయన, షణ్ముక్ జశ్వంత్ అఫిషియల్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ క్యూట్ కపుల్ విడిపోవడంతో.. వారి ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే దీప్తి చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.