తెలుగు వార్తలు » Satyam Team
రెండవ సారి ఆపరేషన్ చేపట్టిన తర్వాత రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనులు ఐదవ రోజు కూడా కొనసాగుతున్నాయి. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసేదెవరు..? బోటుకు తాడు కట్టి ఒడ్డుకు చేర్చే మొనగాడెవరు..? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బోటు వెలికితీత పనులు మూడు అడుగులు ముందుకి.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. స�
ఆపరేషన్ వశిష్టకు మరోసారి బ్రేకులు పడ్డాయి. తాత్కాలికంగా బోటును వెలికితీసే పనులు నిలిపివేయాలని ధర్మాడి సత్యం బృందానికి అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఉదయం నదిలోకి వెళ్లి లంగర్లు వేసి బోటును లాగే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఆదేశాలు వచ్చాయి. దీంతో ధర్మాడి సత్యం బృందం అయోమయంలో పడింది. ఇటు అధికారులు బోటును వెలికితీస�
రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని చెప్పిన ధర్మాడి సత్యం టీం రోజులు గడుపుతూ వస్తోంది. కాని, బోటును మాత్రం తీయలేకపోతోంది. మొదటి సారి ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు వర్షాలు పడటం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోడంతో ప్రయత్నాన్ని ఆపివేశారు. ఇక సరిగ్గా వారం రోజుల తర్వాత
పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును తీయడం సాధ్యమేనా..? పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్న ధర్మాడి సత్యం టీం తన లక్ష్యాన్ని చేధిస్తుందా..? కళ్లు కాయలు కాచేలా తమ వారికోసం ఎదురుచూస్తున్న బాధితులు ఆశలు నెరవేరేనా..? అన్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం నుం�
పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. బోటును వెలికితీయలేమని ధర్మాడి సత్యం టీం చేతులెత్తేసింది. మూడు రోజులుగా బోటును ఒడ్డుకు తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అయితే గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం, గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేసిన�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుండటంతో మూడో రోజు కూడా ఆపరేషన్ వశిష్టకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షంతో బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. మంగళవారం ఒక్క లంగర్‌తో బోటును వెలికితీసే ప్రయత్నం చేసి విఫలం కావడంతో.. బుధవారం రెండు లంగర్లతో బోటును బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒక్�
గోదావరిలో వరద ప్రవాహం కాస్త తగ్గిన నేపథ్యంలో.. బోటు వెలికితీత పై ఆశలు చిగురిస్తున్నాయి. సోమవారం బయటకు తీయాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ రోజు కూడా బోటును బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఫలితం కనిపించలేదు. అయితే సోమవారం నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగిపోవడంతో వెయ్యి మీ�
పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండవ రోజు కూడా రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ ముగిసింది. కాని బోటు మాత్రం ఓడ్డుకు రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల బోటును ఓడ్డుకు తీసే ప్రయత్నం ఆలస్యం అవుతోందని ధర్మాడి సత్యం టీం చెబుతోంది