తెలుగు వార్తలు » Saroor nagar
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ వద్ద బైక్ డివైడర్ పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అస్లాం ఖాన్ (45), నహిదా బేగం (37) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.