పెద్దోళ్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలు వెళ్ళిపోతే ఏం చెయ్యలేవు బ్యాంకులు. అదే సామాన్య రైతులు ఒక్క వాయిదా కట్టకపోయినా.. పెద్ద నేరం జరిగిపోయినట్లు నోటీసులు ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు అయితే సదరు రైతులు లోన్లు కట్టలేదంటూ ఫోటోలతో హోర్డింగులు పెడతాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్..
ప్రస్తుతం చిత్ర యూనిట్ సెట్టింగ్స్‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తున్నారు. ఇందుకుగాను ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది...