రీనో నగరంలోని హిందూ మందిర్‌లో గురు పూర్ణిమ ఉత్సవాలను ఏంతో వైభవంగా నిర్వహించారు. షిర్డీ సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన ఎన్నారై తెలుగు భక్తులు గురు పూర్ణిమ వేడుకల కోసం ఈ ఆలయానికి తరలివచ్చారు.
అట్లాంటాలోని సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇక ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పాత ఆలయ రీ- మోడలింగ్ పనులు కూడా ప్రారంభించారు ట్రస్ట్ సభ్యులు. ఇక ఆ పనుల్లో భక్తులు పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలని ట్రస్టీ సభ్యులు కోరుతున్నారు.
డల్లాస్‌లో షిరిడిసాయి టెంపుల్ గ్రాండ్ ఓపెనింగ్‌లో ప్రవాసులు వివిధ పూజా కార్యక్రమాల్లో ఆడిపాడారు. టీనేజర్లు ఫ్లూట్ తబలా వాయించి సంగీతం అందించగా వాలంటీర్లు చావిడిపై సాయిబాబాను ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పాటలు భజన కార్యక్రమాలలో మహిళలు వివిధ రకాల డాన్సులు చేశారు. ఇండియా నుంచి వచ్చిన అర్చకులు షేజ్ హారతి పట్టడంతో సంస్క�