అమెరికా వైఖరి, ఆసియాలో విశ్వనీయత గురించి నిరూపించుకోవాల్సిన అవసరముందని వ్యాసకర్త ప్రణయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన క్వాడ్ సదస్సు, అమెరికా అవలంభిస్తున్న విధానాలపై న్యూస్9తో పలు విషయాలను పంచుకున్నారు.
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ క్వాడ్ సదస్సుకు హాజరై పలు అంశాలపై చర్చించారు.
క్వాడ్ దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇండో-పసిఫిక్ సదస్సులో పాల్గొని అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని కిషిదాతో భేటీ అయ్యారు.
జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ 40 గంటల్లో 23 సమావేశాల్లో పాల్గొననున్నారు. క్వాడ్ సమ్మిట్‌తోపాటు జపాన్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు.
కొత్త యుద్ధతంత్రాలకు నాందీ పలకడం.. కొత్త కూటమిలను ఏర్పాటు చేస్తూ ప్రపంచ పెద్దన్న తానేనని చాటుకోవడంలో అమెరికా ఎప్పుడూ ముందే వుంటుంది. ఈక్రమంలోనే తాజాగా ఓవైపు క్వాడ్ (క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) పేరిట జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాతో ఓ కూటమిని బలోపేతం చేస్తున్న సంకేతాల్నిస్తోంది. ఈ నాలుగు దేశాల కూటమి...