తెలుగు వార్తలు » Poll2019
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తెరపైకి వచ్చారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నందున ఈ ఎన్నికలను బహిష్కరించాలని తాను సూచించానని కేఏ పాల్ అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. అమెరికాలో ఈవీఎంలతో పాటు బ్యాలెట్ విధానం కూడా అమలవుత�
సార్వ్రతిక ఎన్నకల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ.. రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను అలర్ట్ చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో హింస జరిగే అవకాశాలున్నందున రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా భద్రతకు అన్ని రాష్ట్రాలు, కేంద
కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ దేశ ప్రజలకు, ఆ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ళ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఆశీర్వదిస్తున్న లక్షలాది మందికి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. In the last 5 years not a day went by when Narendra Modi was not subjected to humiliation and hateful barbs by the opposition. However, as karyakartas we […]
కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోదీ బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లో పర్యటించడం కూడా కోడ్ ఉల్లంఘనకు వస్తుందన్నారు. మోదీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పర్యటనను �
సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం ఏడు విడతలుగా జరిగిన పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 53.03 శాతం ఓటింగ్ నమోదైంది. బీహర్‌లో 46.75 శాతం, మధ్యప్రదేశ్‌లో 59.75 శాతం, పంజాబ్ 50.49 శాతం, ఉత్తర్‌ప్రదేశ్ 47.21 శాతం, వెస్ట్ బెంగాల్ 64.87 శాతం, జార్ఖండ్ 66.64శాతం చంఢీగర్ 51.18 శాతం నమోదైంది. వెస్ట్ బెంగాల్‌లో ఈ విడతలో కూడా పలుచోట్ల �
ఓటు హక్కు వినియోగించుకోవడం దేశ పౌరుడిగా ప్రతిఒక్కరి ప్రథమ కర్తవ్యం. కానీ ప్రస్తుతం ఎంతో మంది దానిని ఉపయోగించుకోవడం లేదు. అయితే బీహార్ రాజధాని పాట్నాలో తొలిసారిగా కవలలు ఓటు హక్కును వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 19 ఏళ్ల వయస్సు గల సబా, ఫరా అనే ఇద్దరు పుట్టుకతోనే అవిభక్త కవలలు. అయితే వీరిద్దరికీ వేరువేరుగా ఓ�
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల్లో అనంతపురంలో పార్టీలన్నీ రూ.50 కోట్లు ఖర్చుచేశాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి.. జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘ�
పశ్చిమ బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి బీజేపీ నాయకులు ముకుల్ రాయ్, శామిక్ భట్టాచార్య వాహనాలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో వారు వాహనాల్లో లేకప�
చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్ జగన్ కుట్రలో భాగమేనని ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. పోలింగ్ జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశిస్తారా.. అంటూ ఈసీని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు జగన్‌తోపాటు ప్రశాంత్ కిషోర్, విజయసాయిరెడ్డి కలిసి అనేక కుట్రలు చేశారని విమర్శించారు
గాంధీజీని హతమార్చిన గాడ్సే తొలి హిందూ తీవ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ చీఫ్ కమల్‌హాసన్‌పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతోంది. గురువారం ఆయనపై రెండుచోట్ల దాడులు జరిగాయి. అరవకురిచ్చిలో ఎన్నికల సభలో ప్రసంగించి వేదిక దిగుతుండగా, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, కోడిగుడ్లు, రాళ్లతో ఆ