పంజ్‌షేర్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రపంచంపై ఉందని ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలాహే. తాలిబన్లు రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫ్గనిస్తాన్‌లో.. మళ్లీ రాక్షస రాజ్యం మొదలైంది. మతచాందసవాదులు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రావిన్స్‌లలో కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తూ.. పౌరులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. కానీ ఈ దేశంలోని ఓ ప్రదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం వారు వణికిపోతున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇటువైపు చూసేందుకు కూడా భయపడిపోయేవారు. అద�