యంగ్ టైగర్ ఎన్టీఆర్..! యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అదిరిపోద్ది కదూ..! పటాస్‌తో అన్నకు హిట్ పడ్డట్టే..
గతంలో శివ.. తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారెజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీంగా నటించి ఆకట్టుకున్నారు తారక్.