తెలుగు వార్తలు » Nirbhaya Convicts Hanged In Tihar Jail
ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ ఆత్మ శాంతించింది. గత ఏడేళ్లుగా యావత్ భారత్ ఎదురుచూసిన క్షణం వచ్చింది. నిర్భయ దోషులను ఉరి కొయ్యలకు వేలాడదీశారు.
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
Justice For Nirbhaya: ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు తీహార్ జైలులో దోషులైన అక్షయ్ ఠాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ కుమార్ లను ఉరి తీశారు. జైలు నెంబర్ 3లో వాళ్లను ఉరి తీసేటప్పుడు ఉరికంబం దగ్గర 48 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు న్యాయవ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్‌ను ఉపయోగ�