తెలుగు వార్తలు » Nirbhaya convicts earnings
ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ ఆత్మ శాంతించింది. గత ఏడేళ్లుగా యావత్ భారత్ ఎదురుచూసిన క్షణం వచ్చింది. నిర్భయ దోషులను ఉరి కొయ్యలకు వేలాడదీశారు.
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.