తెలుగు వార్తలు » Nirbhaya Case Accused
నిర్భయ దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. నిర్భయ దోషులు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని క్యూరేటివ్ పిటిషన్‌లో సుప్రీంని కోరారు నిర్భయ దోషులు. అయితే.. ఈ క్యూరేటివ్ పిటిషన్ విచారణకు ఈ దోషులు అర్హులు కారని సుప్రీం కోర్టు స్పష్టం చేస�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అతని రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ.. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్ట�
నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు మృత్యువు దగ్గర పడింది. ఈ నెల 17న వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్టు ఫారం నెంబర్.42 లేదా బ్లాక్ వారెంట్/ డెత్ వారెంట్ జారీ చేయనుంది. ఒక నేరస్తుడికి మరణ శిక్ష విధించాలంటే ‘బ్లాక్ వారెంట్’ తప్పనిసరి. ఇప్పటికే ఈ నిందితుల్ల�
దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012 న ఫిజియోథెరపీ విద్యార్థిని పై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన నలుగురిని ఉరి తీసే ఏర్పాట్లను తీహార్ జైలులోని జైలు అధికారులు ప్రారంభించారు. ఉరి తాడు, ఉరితీసేవారి సేవల కోసం బీహార్‌లోని జైలు అధికారులను సంప్రదించారు. “మేము 10 కొత్త ఉరి తాడులకోసం బక్సర్ జైలు అధికారులను సంప్రదించాము. సమయం వచ్చ
నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్‌కుమార్ సింగ్ తనకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది. కాగా, ఢిల్లీలో ఉన్న జల, వాయు కాలుష్యం వల్ల ఇప్పటికే ఆయుష్ తగ్గిపోతో�
దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుష ఘటనకు ఇన్నాళ్లకు న్యాయం జరిగేలా కనిపిస్తోంది. నిర్భయ కేసులోని నిందితులను ఈ నెలలోనే ఉరి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే దోషులను తాము ఉరి తీస్తామంటూ దేశ విదేశాల నుంచి తీహార్ జైలు అధికారులకు సుమారు 15 లేఖలు పంపారట. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, చత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు రాష�