పోలీసులు తప్పుడు కేసు పెట్టారంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం జగన్..ఐజీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
నంద్యాల కౌలూరు వద్ద ఈ నెల 3న రైలు కింద పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారిని నంద్యాలలోని రోజాకుంటకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులుగా గుర్తించారు.