సామాజిక న్యాయం జరిగే క్రమంలో కొంతమంది నేతలకు కేబినెట్లో అవకాశం దక్కలేదు. పదవులు ఆశించిన బాలినేని, పిన్నెల్లి, ఉదయభాను, కోటంరెడ్డి, కరణం ధర్మశ్రీ, సుచరిత, అన్నా రాంబాబులకు నిరాశ ఎదురైంది. దీంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల అనుచరులు వరుసగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.