తెలుగు వార్తలు » malliah
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకులా చలామణి అవుతున్నాడు. విడాకుల కేసు న్యాయస్థానంలో నడుస్తుండగానే తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ నిర్వాకమిది. కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న అతడి రెండో భార్య తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది