తెలుగు వార్తలు » Malkangiri
ఒడిశా లోని మల్కాన్ గిరి జిల్లా కలెక్టర్ మనీష్ అగర్వాల్ పైన, ఆయన కార్యాలయంలో పని చేసే మరో ముగ్గురిపైనా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశా..మల్కాన్ గిరి లోని ఆసుపత్రిలో టిక్ టాక్ వీడియోలు తీసి రికార్డు చేసిన నలుగురు నర్సులమీదా ఉద్వాసన వేటు పడనుంది. వీరిని సెలవుపై వెళ్ళాల్సిందిగా మల్కాన్ గిరి జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ అగర్వాల్ ఆదేశించారు. జిల్లా మెడికల్ కార్యాలయం నుంచి అందిన సిఫారసు మేరకు ఆయన ఈ ఉత్తర్వులిచ్చారు. ఈ నర్సుల వ్యవహారంపై విచారణకు ఓ ప్ర�
ఏవోబీలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మల్కాన్‌గిరి జిల్లా కిముడుపల్లి పంచాయితీ కార్యాలయాన్ని వారు పేల్చేశారు. శుక్రవారం రాత్రి సమయంలో ఈ దాడికి వారు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కార్యాలయం చుట్టూ 30 నుంచి 40 పేలుడు పదార్థాలను అమర్చి ఈ పేలుడును చేశారని వారు గుర్తించారు. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు చే�
ఒడిశాలో మావోలు రెచ్చిపోయారు. జవాన్లే లక్ష్యంగా మల్కాన్‌గిరి జిల్లా మథిలి పీఎస్ పరిధిలోని బోగపదార్‌లో ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బోగపదార్ కొండల్లో జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు