తెలుగు వార్తలు » Lok sabha Results
వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, అయితేనేం పట్టుదలతో ఓటమి నుంచి తేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగి విజయం సాధించారు. ప్రజల్లో వారికున్నపట్టుకు నిదర్శనం. తెలంగాణలో తాజాగా వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు ప్రముఖులు… మళ్లీ స్వల�
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి టీడీపీ నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. టీడీపీ ఓటమి పాలవ్వడంతో నిన్నటి నుంచి వరుసగా వ్యంగ్యంగా పోస్టుల చేస్తూ విమర్శిస్తున్నాడు. ఇవాళ ఏకంగా ఎన్టీఆర్ కలలోకి వచ్చి టీడీపీ ఓటమిపై తనతో చెప్పారంటూ ట్వీట్ చేశారు. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయనివ్వకుండా టీడీపీ అడ్డుకు
ఏపీ ఓటర్లు మార్పు ఆశించే జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. టీడీపీ ఓటమిని అంగీకరిస్తున్నామని.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం, ధైర్యం ఇవ్వడానికే తొడగొట్టి ఛాలెంజ్ చేశానని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని అన్�
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ఎన్నికల్లో తమ పార్టీ బాగానే పనిచేసిందన్నారు. డబ్బు ప్రవాహంతోనే తమిళనాడులో ఫలితాలు తారుమారైనట్లు చెప్పారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. తమ పార్టీ మొదట్లో ఓటింగ్ శాతం బాగానే ఉండి క్రమంగా తగ�
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. మూడు పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడంతో పార్టీ సేఫ్ జోన్‌లో ఉందన్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామనుకున్నామని.. కానీ మూడు చోట్ల కీలక నేతలను గెలిపించుకున్నామన్నారు. ఇక బీజే�
సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన అఖండ విజయంతో కమల దళం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇవాళ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు పార్టీ అగ్రనేతలైన అద్వాణీ, మురళీ మనోహర్ జోషిలను కలిసి వారి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. బీజేపీ నేడు విజ�
ఎన్నికల్లో విజయందుందుబి మోగించిన వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని పార్క్ విల్లే దగ్గర ఉదయం నుంచిసెక్యూరిటీ నిబంధనలు అమలు చేశారు. మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడంతోపాటు నివాసానికి వెళ్లే రోడ్డులో అనధికారిక వాహనాలను అనుమతించడంలేదు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇంటిలిజెన్స్, స�
రాజకీయ నాయకులు కొంతమంది అధికారం తమ చేతుల్లో ఉందని చెలరేగిపోతుంటారు. ఏపీలో అలాంటి వారి జాబితాను తయారు చేస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ముందు వరుసలో ఉంటారు. గతంలో తన ఇసుక అక్రమాల్ని ప్రశ్నించిన మహిళా రెవెన్యూ అధికారి వనజాక్షిపై దాష్ఠీకంగా ప్రవర్తించి తీరు అందరికి తెలిసిందే. ఈ ఘటన�
శ్రీకాకుళం పార్లమెంట్ ఫలితంపై తెల్లవారుజాము వరకు హైడ్రామా నడిచింది. ఇక్కడి ఫలితంపై రీకౌంటింగ్ నిర్వహించాలని వైసీపీ అభ్యర్థి డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రామ్మోహన్ నాయుడు 7,348 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు సు�
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతున్న సమయంలో వచ్చి తనదైన శైలి జోక్స్‌తో ప్రజలను కూల్ చేశాడు కేఏ పాల్. ఆ తరుణంలో సోషల్ మీడియాలో ఈయన చిత్రాలు హోరెత్తాయి. అయితే అవేవి పాల్‌కు ఓట్ల వర్షం కురిపించలేదు. ప్రజాశాంతి పార్టీ స్థాపించి.. రాష్ట్రంలోని అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టినా.. ఒక్కచోటా డిపాజిట్ దక్కలేదు, ఇక స్�