కరోనా ప్రభావంతో గణేష్ నవరాత్రి ఉత్సవాల కళతప్పింది. ఊరేగింపులు, లడ్డూ వేలం పాటలు లేకుండానే సాదాసీదాగా సాగిపోతున్నాయి. ప్రతీ ఏడాది ఎంతో ఉత్సహంగా జరిగే బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలాన్ని ఉత్సవ కమిటీ ఈసారి రద్దు చేసింది.
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాలు ఊపందుకున్నాయి. నిమజ్జనానికి ముందు లడ్డూ, పండ్లు, పూలదండల వేలం వేస్తున్నారు. వీటిని భారీ ధరలతో దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే ..నగరంలోని భోలక్‌పూర్ డివిజన్లో ఏర్పాటు చేసిన మండపం వద్ద బంగారు లడ్డూ వేలం కోలాహలంగా జరిగింది. శ్రీ సిద్ధివినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వ�