కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్న పన్ను ఊడుతుంది అన్నది పెద్దవాళ్ళు చెప్పే సామెత.. ఇదే సామెత ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ విషయంలోనూ జరుగుతుందని అనిపిస్తుంది.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్.. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకుంది.
ప్రస్తుతం హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవలే మహేష్ సరసన సర్కారు వారి పాట చిత్రంలో కళావతి పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా తెలుగు, తమిళ చిత్రాలు విజయం సాధించడంతో అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ షేర్ చేసింది.