చెల్లి దూరం అయింది. ప్రతి ఏటా రాఖీ కట్టే సోదరి ఈ ఏడాది లేదు. కానీ ఆమె తమతో లేదు అని భావించలేదు ఆసోదరులు. చెల్లెలి ప్రతిమ తయారు చేయించి మరీ రాఖీ కట్టించుకున్నారు.
4 నెలలుగా దొరకకుండా అటవీ శాఖా అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న పులి కోసం మళ్లీ వేట మొదలు పెట్టారు ఏపీ అటవీశాఖ అధికారులు. ఈసారి మీరట్ నుంచి ప్రత్యేక బోన్ ను తెప్పించారు.
ఏపీ సీఎం జగన్ ఓ మహిళ కోసం తన కాన్వాయ్ ఆపారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె చెప్పిన మాటలను సీఎం సావధానంగా వెన్నారు. వెంటనే ఆమెకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తాడిపెద్దును అదుపుచేసి, తుని జనానికి ఉపశమనం కలిగించేందుకు మునిసిపల్ సిబ్బంది, పశుసంవర్థక అధికారులు, పోలీసులు ఒక్కటిగా చేరి తీవ్రంగా ప్రయత్నించారు. మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఓ తల్లి.. తన కొడుకు, కోడలు తనపట్ల చూపిస్తున్న దాష్టీకాన్ని భరించలేను.. నాకు కారుణ్య మరణాన్ని వరంగా ఇప్పించండి.. మహా ప్రభో అంటూ.. ఓ ఎస్పీకి విన్నపం చేసుకుంది
ఏదైనా కార్యక్రమం ప్రారంభించడానికి ముందు జాతీయగేయం వందేమాతరం ఆలపించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కడ ఉన్నవారు వందేమాతరం ఆలపించారు.
కాకినాడ జిల్లాలో రౌతులపూడి మండలం లో సంచరిస్తున్నపులి.. నర్సీపట్నం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి.. రెండు ఒకటేనా.. లేక రెండు వేరు వేరు పులులా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.
బైక్స్ చోరీ చేయడంలో సెంచరీ చేశాడు. అయినా పోలీసులకు చిక్కలేదు. కొత్త బైక్స్ను కూడా తక్కువ ధరకు వస్తుండటంతో కొందరు వాటిని కొనుగోలు చేశారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు.