పెద్దోళ్లు అప్పులు ఎగ్గొట్టి విదేశాలు వెళ్ళిపోతే ఏం చెయ్యలేవు బ్యాంకులు. అదే సామాన్య రైతులు ఒక్క వాయిదా కట్టకపోయినా.. పెద్ద నేరం జరిగిపోయినట్లు నోటీసులు ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు అయితే సదరు రైతులు లోన్లు కట్టలేదంటూ ఫోటోలతో హోర్డింగులు పెడతాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేపథ్యంలో తీసిన ‘భోబిష్యోటర్ భూత్’ అనే సినిమాపై నిషేధం విధించినందుకుగానూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి 20 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. సినిమా నిషేధం వల్ల నష్టపోయిన సినిమా నిర్మాతలకు, థియేటర్ యజమానులకు ఈ మొత్తాన్ని చెల్లించాలని పశ్చ�