నవీన్ పొలిశెట్టి.. జాతి రత్నాలు సినిమాతో హిట్టు కొట్టాడు.. రిలీజ్ అయిన రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాడు. అంతే కాదు.. ఇండస్ట్రీ పెద్దలను తన వైపే చూసేలా చేసుకున్నాడు.
గురువారం ఉదయం 'జాతిరత్నాలు' టీం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మహశివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా 'జాతిరత్నాలు' టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.