జమ్ముకశ్మీర్ ఉగ్రవాదులతో ప్రాణాలకు తెగించి పోరాడి వీరమరణం చెందిన తెలంగాణకు చెందిన మహేష్ భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా అమరవీరునికి గ్రామం మొత్తం ఘన నీరాజనాలు పలికి బాధాతప్తహృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ లో ఉగ్రమూకలతో పోరాటి ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయం అతని స్వగ్రామం చేరుకుంది. రాత్రి 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ప్రవీణ్ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా ఐరాల రెడ్డివారిపల్లి గ్రామానికి తీసుకువచ్చారు. మృతదేహం ఊర్లోకి చేరుకోగానే ప్రవీణ్ తల్లిదండ్రులు, భార్య పిల్లలతో పాటు అప్పటికే అక్