Coronavirus: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 71,365 మందికి వైరస్ సోకింది. కొవిడ్ ధాటికి మరో 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉరిమే వేగంతో ఒమిక్రాన్ వైరస్ విస్తరిస్తోంది. కేసుల సంఖ్య 30 కోట్లు దాటింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 26 లక్షల కేసులు వచ్చాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.