హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూన్ చెప్పింది. నగరంలో కరోనా కేసులు తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వేళల్లో మెట్రో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. రైలు వేళలను రాత్రి పూట పొడిగించారు.
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్డౌన్ ఎత్తివేశారు. దీంతో హైదారాబాద్ నగరంలో ప్రజా రవాణ వ్యవస్థ షురూ చేసేందుకు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే క్రమంలో మెట్రో రైలు సర్వీసుల్లో అధికారులు మార్పులు చేశారు.
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాత్రి పూట చివరి సర్వీస్‌ను కొనసాగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి సర్వీస్‌ను రాత్రి 11 గంటలకు బయలుదేరి గం.11.50ని.లకు ఆఖరి స్టాప్ వద్ద ఆగనుందని మైట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉదయం సర్వీసులు ఇదివరకు 6గంటల నుంచి ప్రారంభం కానుండగా..