జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించడాన్ని మసీదు సంరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో అధికారులు సర్వేను నిలిపివేశారు. ఇదే అంశంపై కోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. రేపు సర్వే చేసి ఈనెల 17నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Gyanvapi Masjid Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాలతో మసీదులో సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది.