తెలుగు వార్తలు » Ghantasala
ఘంటసాల తీయని గాంధర్వ హేల. కలికి ముత్యాలశాల. ఆయన స్వర ధారలో తడవని తెలుగువారుంటారా అసలు! ఆయన తెలుగుతల్లికి కంఠాభరణం.
న్యూజెర్సీలో ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఆ అమరగాయకుడి పాటలతో ఘనమైన నివాళి అర్పించారు. అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలోని మర్చి రెస్టారెంట్‌లో సంగీత ప్రియులు, సంగీత అభిమానులందరూ సమావేశమయ్యారు. వారి పాటలు, మాటలతో ఘంటసాలకు మిక్కిలి గౌరవాన్ని చేకూర్చారు. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జర�