క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ శివార్లలో అర్థరాత్రి గుర్తు తెలియని వస్తువు ఒకటి ఆకాశం నుంచి కుప్పకూలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కూలిపోయిన వస్తువు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
జమ్మూ లోని సాంబా జిల్లా బీర్ పూర్ లో శనివారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ఎగురుతున్న వస్తువునొకదానిని భారత జవాన్లు చూశారు. వెంటనే గాలింపు జరపగా వారికి ఆ తరువాత ఏ వస్తువూ కనబడలేదు.