Car fire : నిలిచి ఉన్న కారులో ఒక్కసారిగా రేగిన మంటలు, సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర ఘటన భాగ్యనగరంలో రోడ్డు మీద నిలిచి ఉన్న కారు ఉన్నఫళంగా అగ్నికి ఆహుతి కావడం కలవరపరచింది. ..
నివర్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం గొల్లపల్లిలోని భూ లోకమాంబ ఫైర్ వర్క్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందులో పని చేస్తున్న ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారంమందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని కేజీహెచ్‌కు తరలించారు. బాణాసంచా తయారీలో భా�
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టెంట్ హౌస్ గోదాంలో అకస్మాత్తుగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంలో స్�
విజయవాడ బెంజ్ సర్కిల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ఏటీఎం కాలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఏటీఎం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు
హైదరాబాద్ బాలాపూర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో సెల్ టవర్ మానిటరింగ్ షెల్డర్ దగ్ధమైంది. ఇండస్ టవర్స్ ఏర్పాటు చేసిన జియో, ఎయిర్ టెల్, ఐడియా టవర్ దగ్గర పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సె�
జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వెదురు కర్రల షాప్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తూండగానే పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కు చేరుకుని మంటలను అదుపుచేయడంతో ముప్పు తప్పింది. ప్రమాద కారణాలపై అధికారులు ఆరా తీయగా.. వంట చేస్తుండగా మంటలు ఎగిశాయ
తూర్పుగోదావరి జిల్లా గోల్లప్రోలులో హైవేపై లారీ తగలబడింది. చెందుర్తి జంక్షన్ సమీపంలో రాత్రి లారీ వెనక టైరుపేలడంతో మంటలు చెరేగాయి. విశాఖ నుంచి రాజమండ్రి వైపు బొగ్గులోడుతో ఈ లారీ వెళుతోంది. మంటలు చెలరేగిన వెంటనే అక్కడున్నవారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో
ఆస్ట్రేలియాలోని ఒక పార్క్‌లో వ్యాప్తించిన అగ్నికీలలు భారీ ఆస్తి నష్టానికి దారి తీశాయి. బనియప్ పార్క్ లో వ్యాపించిన అగ్ని పేలుళ్ళకు దారితీయగా.. సమీపంలోని నివాస స్థలాలు అగ్నికి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో పలు ఆస్తులు దగ్ధమైపోగా అగ్నికీలలు వ్యాపించకుండా 850 ఫైర్ ఫైటర్స్ ని రంగంలోకి దింపారు. సమీప నివాస ప్రజలను ఇతర ప్రాంతాలక
ప్రకాశం జిల్లా పర్చూరులోని ఇందిరాకాలనీలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని నాలుగు పూరిల్లు దగ్ధమయ్యాయి. తొలుత ఓ గుడిసెలో అంటుకున్న మంటలు క్షణాల్లో మిగతావాటికి అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మంటలకు కాలిబూడిదయ్యాయని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంట