పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రం పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పలు రాయితీలను ప్రకటిస్తోంది.
కేంద్ర ప్రభుత్వపు ఫేమ్ 2 పథకం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలపై టూవీలర్‌పై రూ.20,000 వరకు, కారుపై రూ.లక్షన్నర వరకు ఆదా చేసుకోవచ్చు. ఫేమ్ 2 పథకం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీని కోసం రూ.10,000 కోట్లు కేటాయించింది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు మూడేళ్ల సమగ్ర వారె�