టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. వికెట్ల వెనుక ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ క్రీజు దాటితే చాలు.. రెప్పపాటులో స్టంపింగ్ చేసేస్తాడు. ఒక్క స్టంపింగ్ మాత్రమే కాదు.. రనౌట్ల సమయంలో కూడా వికెట్లు చూడకుండానే బెయిల్స్‌ను ఎగరగొడతాడు ధోని. క్రికెట్ అభిమానులనే కాదు.. దిగ్గజాలను సై�