ప్రస్తుత పరిస్థితుల్లో డ్రోన్ల వాడకం విరివిగా పెరిగింది..అన్ని రంగాల్లోనూ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. వ్యవసాయ రంగం మొదలుకొని రక్షణ రంగం వరకు అన్ని సేవలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా పెరు దేశ రాజధాని లీమాలో డ్రోన్ సాయంతో ఓ పావురం ప్రాణాలు కాపాడారు అక్కడి పోలీసులు.
రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జిలెటిన్ స్టిక్స్ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిబాబా గుడి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో రాళ్లను పేల్చుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ చేస్తున్న సమయంలో రాళ్లు పైకి లేవకుండా జేసీబీతో మట్టిపోసేందు