ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌషంబి జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డుపై ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చింది. దేవిగంజ్ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు.