సుశాంత్ కమ్ డ్రగ్స్ కేసులో ఈ మధ్యే బెయిల్ పై విడుదలైన రియా చక్రవర్తి ఇంటి పక్కనే ఉన్నానని చెప్పుకున్న ఓ మహిళ. సీబీఐని తికమక పెట్టింది. డింపుల్ థావనీ అనే ఈమె తాను గత జూన్ 13 న రియా, సుశాంత్ లను చూశానని సీబీఐ అధికారులకు తెలిపింది. అయితే వారు గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో, తాను వారిని చూడలేదని, ఎవరో చెబితే విన్నానని చెప్పింది.